ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిథిలాల్లో చిక్కుకున్న శునకం.. రక్షించిన కానిస్టేబుల్ - vishakha latest news

విశాఖలో శిథిలాల్లో శునకం ఇరుక్కుపోయింది. స్థానికులు ఆ కుక్కను బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. 100కు డయల్ చేయగా.. కానిస్టేబుల్ వచ్చి సురక్షితంగా శునకాన్ని బయటకు తీశాడు. గంటపాటు శునకం నరకయాతన అనుభవించింది.

dog
dog

By

Published : Aug 11, 2021, 3:08 PM IST

విశాఖ నగర శివారులో రెండు గోడల మధ్య ఓ కుక్క ఇరుక్కుపోయింది. చేపల ఉప్పాడ వద్ద జరిగిన ఈ ఘటనలో శునకం గంట పాటు గిలగిలలాడింది. ఆ శునకాన్ని తీసేందుకు స్థానికులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇక లాభం లేదనుకుని.. 100కు ఫోన్ చేశారు. ఓ కానిస్టేబుల్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ విధులను నిర్వర్తిస్తున్న మరో కానిస్టేబుల్ పరవాడ కృష్ణకు ఈ విషయం తెలియడంతో అక్కడకు వెళ్లారు. గోడలను తొలగించి శునకాన్ని సురక్షితంగా బయటకు తీశారు. గంటపాటు నరకయాతన పడ్డ శునకం..బయటపడగానే హమ్మయ్యా అంటూ పరుగులు తీసింది. శునకాన్ని రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు.

శిథిలాల్లో చిక్కుకున్న శునకం.. సురక్షితంగా బయటకు తీసిన కానిస్టేబుల్

ఇదీ చదవండి:సింహగిరిపై కూలిన సీతారామస్వామి ఆలయ ధ్వజస్తంభం

ABOUT THE AUTHOR

...view details