ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Constable Murder Case: ప్రియుడి కోసం భర్తను హతమార్చింది.. అనుమానం రాకుండా.. లక్షన్నర పెట్టి.. - Visakhapatnam Constable Murder Case

Constable Murder Case: పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనుకున్న ఓ మహిళ.. భర్తను హతమార్చినట్లు.. విశాఖలో సంచలనం రేపిన కానిస్టేబుల్​ కేసులో పోలీసులు వివరాలు వెల్లడించారు. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు.. భర్తకు మద్యం తాగించింది. ఆ తరువాత ప్లాన్ ప్రకారం చంపించింది. ఇంతకీ ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారంటే..?

Constable Murder Case
కానిస్టేబుల్ హత్య కేసు

By

Published : Aug 4, 2023, 5:19 PM IST

Updated : Aug 4, 2023, 6:21 PM IST

Constable Murder Case ప్రియుడి కోసం భర్తను హతమార్చింది.. అనుమానం రాకుండా.. లక్షన్నర పెట్టి..

Constable Murder Case: విశాఖలో సంచలనం రేపిన వన్‌టౌన్‌ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడి కోసం.. రమేష్​ను అతని భార్య శివజ్యోతి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సీపీ త్రివిక్రమవర్మ మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఒంటిపై గాయాలు లేవు..: కానిస్టేబుల్ రమేష్​ను భార్య శివజ్యోతి హత్య చేయించిందని.. మూడు రోజులు క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో.. అనుమానాలు కలగకపోవడంతో పోస్ట్​మార్టం కోసం పంపించామని సీపీ అన్నారు.

మదనపల్లెలో మహిళ దారుణ హత్య.. నడిరోడ్డుపై గొంతుకోసిన దుండగులు

ప్రియురాలి ఇంటి ఎదుటే.. ప్రియుడు: వైద్యుల రిపోర్టులో ఊపిరాడక చనిపోయినట్లు తేలడంతో.. కేసును మరింత లోతుగా విచారణ జరిపామని చెప్పారు. ఈ కేసులో భార్యే భర్తను.. ప్రియుడి కోసం చంపించిందని తెలిసిందని పేర్కొన్నారు. రామారావు అనే వ్యక్తితో ఏడాదిన్నరగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. రమేష్ ఎదురు ఇంట్లోనే ప్రియుడు రామారావు ఉంటున్నాడని సీపీ త్రివక్రమవర్మ వెల్లడించారు.

భర్తకు మద్యం తాగించి.. వీడియో తీసి.. ఆ తరువాత..: మూడు రోజుల క్రితం భర్త రమేష్​కు మద్యం తాగించి తాము అన్యోన్యంగా ఉంటున్నామని తెలిపేలా శివజ్యోతి వీడియో తీసింది. ఆ తరువాత రమేష్ పడుకున్నాక ప్రియుడు రామారావును బయట కాపలాగా ఉంచి.. రామారావు స్నేహితుడి సహాయంతో దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపారు. ఆ సమయంలో రమేష్​ను కదలకుండా భార్య శివజ్యోతి కాళ్లు పట్టుకుంది.

Mother: కన్నతల్లి కర్కశత్వం.. సభ్య సమాజం తలదించుకునేలా..!

ప్రియుడు, పిల్లలు కావాలని : రమేష్​ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రుపాయలు ఇచ్చారు. శివజ్యోతి, రామారావుల ప్రేమ వ్యవహారంపై గతంలో అనేక గొడవలు జరిగాయని.. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోవాలని రమేష్ కోరాడని సీపీ తెలిపారు. కానీ పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనుకున్న శివజ్యోతి.. అడ్డుగా ఉన్న రమేష్​ను చంపించిందని అన్నారు. అదే విధంగా ఎటువంటి గాయాలు కాకుండా చంపి.. నేచురల్ డెత్​గా చూపించి.. ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర ప్రయోజనాలను సైతం తీసుకునే దురుద్దేశం కూడా కనిపిస్తోందని సీపీ అన్నారు.

ముందు నుంచీ ఆమె స్వభావం అంతే..: ప్రియుడు రామరావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర రూపాయలు ఇచ్చిందని.. శివజ్యోతికి నేర స్వభావం ఉందని.. ఆమె తల్లిదండ్రులతో సైతం గొడవలు ఉన్నాయని సీపీ త్రివిక్రమవర్మ తెలిపారు. ఈ కేసులో ఏ1గా రమేష్ భార్య శివ జ్యోతి, ఏ2గా శివజ్యోతి ప్రియుడు రామారావు. ఏ3గా నీలాను.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.

"తొలుత అతని భార్య చెప్పిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు వచ్చినప్పుడు అనుమానాస్పద మృతి అనుకున్నాం. పోస్టుమార్టంలో దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు వచ్చింది. విచారిస్తే.. భార్యే చేసింది అని తెలిసింది. ఎదురుగా ఉన్న ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకొని.. భర్త అడ్డంగా ఉన్నాడని ఇలా చేసింది". - త్రివిక్రమ్ వర్మ, సీపీ విశాఖ సిటీ

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..

Last Updated : Aug 4, 2023, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details