విశాఖ జిల్లా నర్సీపట్నం శారదా నగర్లో కానిస్టేబుల్ భార్య అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చిన స్థానికులు పరిశీలించగా.. చనిపోయి కనిపించింది. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తవిటి నాయుడుకు గత ఫిబ్రవరిలో చతురతో వివాహమైంది. అతనికి ఇది రెండో పెళ్లి. పెళ్లైనప్పటినుంచి తమ కుమార్తెను భర్త వేధిస్తున్నాడంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద మృతి - విశాఖ జిల్లా క్రైమ్ న్యూస్
విశాఖ జిల్లా అనకాపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. భర్త వేధింపుల వలనే ఆమె చనిపోయిందంటూ.. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ భార్య మృతి