కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 బిల్లులపై కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ప్రారంభించిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఎ నారాయణరావు అన్నారు. విశాఖ జిల్లా తగరపువలస ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షులు బోగి రమణ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని అత్యవసరంగా అప్రజాస్వామికంగా ఆమోదించిన బిల్లులతో రైతులు పంటపై హక్కులను కోల్పోయారన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలలో ఎక్కువ శాతం రైతులు చదువుకోలేకపోవటంతో...సమాచార లోపంతో ఎక్కువ నష్టం వాటిల్లుతోందన్నారు. రైతులకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టే ముందు సమీక్షలు నిర్వహించాలన్నారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటాలు - visakha newsupdates
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ప్రారంభించిందని...రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఎ నారాయణరావు అన్నారు.
కేంద్రం తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటాలు
ధర నిర్ణయాధికారం పంట పండించిన రైతులకే ఉండాలన్నారు. రైతులను కలిసి బిల్లుపై కష్టనష్టాలను వివరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2కోట్ల మంది రైతుల నుంచి నేరుగా అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. వీటిని నెలాఖరులోగా రాష్ట్రపతికి అందజేస్తామన్నారు.