ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు మద్దతుగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

మోడీ ప్రభుత్వం.. రైతులను రైతు కూలీలుగా మార్చేందుకు అంబానీ, అదానీలకు కొమ్ము కాస్తోందని కాంగ్రెస్ విశాఖ నగర కమిటీ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు విమర్శించారు. కిసాన్ అధికారి దివస్ పురస్కరించుకుని నగరంలోని గాంధీ విగ్రహం వద్ద రైతులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.

congress Satyagraha initiation support of farmers
రైతులకు మద్దతుగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

By

Published : Oct 31, 2020, 5:40 PM IST

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను వ్యాపారుల అధీనంలోకి తెచ్చేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ విశాఖ నగర కమిటీ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు 'కిసాన్ అధికారి దివస్' పురస్కరించుకుని మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద రైతులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రైతు హక్కుల దినోత్సవంగా కిసాన్ అధికారి దివస్ నిర్వహిస్తున్నారు.

మోడీ ప్రభుత్వం.. రైతులను రైతు కూలీలుగా మార్చేందుకు అంబానీ, అదానీలకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని సన్నకారు రైతు కుదేలై... క్రమంగా రైతుకూలీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షలో నగర కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్​ఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details