విశాఖ జిల్లా అనకాపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. వలస కూలీలు, దినసరి కూలీల కుటుంబాలకు రూ.7,500 ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో ప్రదానమంత్రి నరేంద్ర మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. పీసీసీ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దీక్ష చేపట్టనున్నారు.
అనకాపల్లిలో కాంగ్రెస్ నిరసన దీక్ష - అనకాపల్లిలో కాంగ్రెస్ దీక్షలు
వలస కార్మికులు, నిరుపేదలకు రూ.7,500 ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు దీక్షకు కూర్చున్నారు.
అనకాపల్లిలో కాంగ్రెస్ నిరసన దీక్ష