ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ - కాంగ్రెస్ పార్టీ విశాఖలో సంతకాల సేకరణ

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. రాష్ట్రంలో 2 కోట్ల సంతకాలు సేకరించడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకొంది. ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రజలందరూ తమకు సహకరించి.. మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

congress party sign collection in visakha
కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ

By

Published : Oct 27, 2020, 8:28 PM IST

వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ... ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు సంతకాల సేకరణ ప్రారంభించారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల సంతకాలు సేకరించాలని భావించామని ఆయన తెలిపారు.

భాజపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతులకు కీడు చేసే బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 2 కోట్ల సంతకాల సేకరణకు అందరూ సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:మా పాలనలో వ్యవసాయం పండగ: మంత్రి అవంతి

ABOUT THE AUTHOR

...view details