మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని.. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. బడాబాబుల బాగు కోసం ప్రవేశపెట్టిన బిల్లులను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.
నూతన వ్యవసాయ బిల్లుల రద్దుకై కాంగ్రెస్ దీక్షలు - నూతన వ్యవసాయ బిల్లుల రద్దుకై అనకాపల్లిలో కాంగ్రెస్ దీక్ష
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై విశాఖ జిల్లా అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బడా బాబులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల దీక్ష