'కరోనా వేళ ధరలు పెంచి సామాన్యులను దోచుకుంటున్నారు'
విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. కరోనా వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ధరలు పెంచి సామాన్యులను దోచుకుంటున్నాయని ఆరోపించారు.
ap congress protest
కరోనా నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ విశాఖలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరోనా వేళ సామాన్య ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు.. ఇష్టారీతిన ధరలు పెంచి దోచుకుంటున్నాయని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరాలు పెంచటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.