విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రకటించారు. ప్రజాపోరాటంతో ఏర్పాటైన పరిశ్రమ ప్రైవేటీకరణకు ప్రయత్నించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానలపై చింతా మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని... ప్రస్తుతం దానిని కాపాడేది కూడా తమ పార్టీయేనని పేర్కొన్నారు.
CONGRESS LEADER CHINTHA MOHAN: 'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం'
విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోమని కాంగ్రెస్ నేత చింతా మోహన్ తెలిపారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో కష్టపడి సాధించిన పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం దారుణమని పేర్కొన్నారు.
'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం'
80 లక్షలకు పైగా ఉన్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల ఉపకార వేతనాలను ఆపారంటూ మండిపడ్డారు. దీపావళి లోపు ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి