విశాఖ మన్యం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి అయోధ్య రామ మందిర నిర్మాణ బ్యానర్‌ను తాళ్ళతో కట్టటం కలకలం రేపింది. ఈ ఘటనపై డివిజనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అసహనం వ్యక్తం చేశారు. తొలి భారత మహిళ ప్రధానిగా దేశానికి సేవలందించిన ఇందిరాగాంధీ విగ్రహానికి అవమానకరంగా తాళ్లతో బంధించడాన్ని తప్పబట్టారు. సంఘటనపై చరవాణిలో భాజపా నాయకులకు సమాచారం అందించారు. అయితే తాము కట్టలేదని.. ఆర్ఎస్ఎస్ వారు కట్టి ఉంటారని సమాధానం ఇచ్చారన్నారు. ఎవరు చేసినప్పటికీ ఓ మాజీ ప్రధాని ఇలా తాళ్లతో కట్టడం హేయమైన చర్య అని మందలించారు.
ఇందిరాగాంధీ విగ్రహానికి తాళ్లుతో కట్టడంపై కాంగ్రెస్ ఆగ్రహం - ఇందిరా గాంధీ విగ్రహాం తాజా వార్తలు
విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరు ఐటీడీఏ ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి బ్యానర్ తాళ్ళు కట్టడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఇందిరాగాంధీ విగ్రహానికి తాళ్లు కట్టిన వైనం
ఇవీ చూడండి...