CONFUSION IN GLOBAL INVESTIMENT SUMMIT : సహజంగా ఏదైనా ఒక శాఖకు అధికారులుగా ఉన్న వారికి ఆ విభాగానికి సంబంధించి సమాచారం పూర్తిగా తెలిసుండాలి. దానికి సంబంధించి ఎవరు ఏమి అడిగిన వివరణ ఇచ్చే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఓ అధికారి మాత్రం ఓ పారిశ్రామిక వేత్త అడిగిన ప్రశ్నకు తడబడ్డారు. అసలేం జరిగిందంటే..
వచ్చే నెల మార్చి 3, 4 వ తేదీల్లో విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ బెంగుళూరులో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పెట్టుబడిదారులు.. జనపనార, సిసల్ పరిశ్రమలకు సంబంధించిన వివరాలు చెప్పాలంటూ పలు ప్రశ్నలు అడిగారు. అయితే పెట్టుబడిదారులు అడిగిన ప్రశ్నలకు పరిశ్రమల శాఖ అధికారులు తడబడ్డారు.
ఓ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త జనపనార కంటే మేలైన సిసల్ పై ఆసక్తి కనబర్చారు. దాని గురించి రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి చెప్పాలని పదే పదే అడిగారు. తన ఉత్సాహాన్ని అధికారులకు వివరించేందుకు .. చాలా కష్టపడ్డారు. చివరకు ఆ పారిశ్రామికవేత్త ఉత్సాహాన్ని నిరుత్సాహ పర్చలేక.. 'గోంగూరే కదా.. అంటూ జౌళి పరిశ్రమ ముఖ్య కార్యదర్శి సునీత ప్రతిస్పందించారు. పరిశ్రమల శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులే ఇలా అవగాహన లేకుండా స్పందించడంతో పారిశ్రామిక వేత్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. జనపనార పరిశ్రమలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరినా వాటిని పరిశ్రమల శాఖ స్పష్టంగా చెప్పలేక సమాధానం దాటవేయడం.. వారిని విస్తుపోయేలా చేసింది. సిసల్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వివరణ ఇస్తాననడం ఈ కార్యక్రమంలో కొసమెరుపు..
సిసల్ అంటే ఏమిటి: ఈ సిసల్ కలబందను పోలి ఉంటుంది. కాకపోతే కలబంద కన్న కొంచెం ఎక్కువ ఎత్తులో పెరుగుతుంది.టాంజానియాలో సిసల్ ఉత్పత్తి 19వ శతాబ్దం చివరలో జర్మన్ ఈస్ట్ ఆఫ్రికా కంపెనీ ద్వారా ప్రారంభమైంది. జర్మన్, బ్రిటీష్ పరిపాలనలో సిసల్ నిరంతరం ఉత్పత్తి జరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా కార్డేజ్, కార్పెట్‌లో ఉపయోగించడానికి అత్యంత విలువైన ఎగుమతి. 1961లో స్వాతంత్య్రం వచ్చే సమయానికి.. టాంజానియా ప్రపంచంలోనే అతిపెద్ద సిసల్ ఎగుమతిదారు.
సిసల్.. అంటే గోంగూరే కదా.. పెట్టుబడిదారుల ప్రచారంలో జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సమాధానం.. ఇవీ చదవండి: