దేశంలో, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విశాఖలో మహిళా సంఘాలు నిరసన చేశాయి. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపాయి.
రోజు రోజుకూ దాడులు పెరుగుతున్న పాలకులు రక్షణ కల్పించడంలో.. చట్టాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని మహిళా సంఘాలు నిరసన చేశాయి. దేశంలో, రాష్ట్రంలో మహిళా ప్రజా వ్యతిరేక విధానాలు రూపు మారాలని నినదించారు.