ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Parents protest: మా పిల్లలను రోడ్డున పడేయొద్దు..తల్లిదండ్రుల ఆందోళన - Concern of parents of students in Visakhapatnam over non-privatization of aided schools

ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రైవేటుపరం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు గళమెత్తారు. తమ పిల్లలను రోడ్డున పడేయొద్దన్నారు. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో ఈ విషయమై శుక్రవారం ఆందోళనలు చేశారు. విశాఖనగరం టి.పి.టి. కాలనీలోని వసంతబాల విద్యోదయ పాఠశాలలో 350 మంది చదువుతున్నారు. అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి ఆందోళన చేశారు.

మా పిల్లలను రోడ్డున పడేయొద్దు
మా పిల్లలను రోడ్డున పడేయొద్దు

By

Published : Oct 30, 2021, 7:50 AM IST

విశాఖలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డీఈవో చంద్రకళ, పోలీసులు బీ చిత్తూరు జిల్లా నిండ్ర మండలం శ్రీరామాపురం

ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రైవేటుపరం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు గళమెత్తారు. తమ పిల్లలను రోడ్డున పడేయొద్దన్నారు. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో ఈ విషయమై శుక్రవారం ఆందోళనలు చేశారు. విశాఖనగరం టి.పి.టి. కాలనీలోని వసంతబాల విద్యోదయ పాఠశాలలో 350 మంది చదువుతున్నారు. అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి ఆందోళన చేశారు. పెంచిన ఫీజు కట్టాలని, లేదా టీసీలు తీసుకెళ్లాలని యాజమాన్యం చెప్పడంతో తమ పిల్లల భవిష్యత్తు రోడ్డుమీద పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు గంటన్నరసేపు నిరసన తెలిపాక పోలీసులు, విద్యాశాఖాధికారులు రావడంతో వారిని చుట్టుముట్టారు. సమస్య తీవ్రత పెరగడంతో డీఈవో చంద్రకళ వచ్చి మాట్లాడారు. ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. తమ గ్రామంలోని ఎయిడెడ్‌ పాఠశాలను విలీనం చేస్తే దూరప్రాంతాలకు వెళ్లి తమ పిల్లలు చదువుకోలేరని చిత్తూరు జిల్లా నిండ్ర మండలం శ్రీరామాపురం ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం జగన్‌కు శుక్రవారం రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ విద్యాలయాలకు రూ.వేల కోట్ల ఆస్తులున్నాయని తెలిపారు. నిరుపేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు ఉత్తమవిద్యను అందించే సంస్థల మూసివేత, విలీనాలను ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల ఎదుట ధర్నాచేస్తున్న గ్రామస్థులు

ఆ భూములను వేలం వేస్తే ఎలా?

ప్రభుత్వం కళాశాలల భూముల్ని తాకట్టుపెట్టి అప్పులు తీసుకుంటోందని.... ఆ అప్పు తీర్చకపోతే కళాశాలల భూముల్ని వేలం వేస్తారంటూ విశాఖలోని ప్రభుత్వ ఐ.టి.ఐ., ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేశారు. విద్యాసంస్థలను బ్యాంకులకు తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఎదురుగా నినాదాలు చేశారు. పేదలకు అండగా నిలిచిన అలాంటి కళాశాల భవిష్యత్తును ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలను తాకట్టు నుంచి మినహాయించాలన్న ప్రధాన లక్ష్యంతో పూర్వ విద్యార్థులు ఐక్య పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు.

ఆందోళన చేస్తున్న విశాఖలోని ఐ.టి.ఐ., పాలిటెక్నిక్‌ కళాశాలల పూర్వ విద్యార్థులు

మినహాయించాలని వినతి: ‘విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ ఐ.టి.ఐ.లకు చెందిన 40 ఎకరాలను ప్రభుత్వం తాకట్టు పెట్టింది. బ్యాంకులు ఐదేళ్ల తర్వాత ఆయా భూముల్ని వేలం వేస్తే ప్రభుత్వ విద్యాసంస్థ చివరకు ప్రైవేటుపరం అవుతుందని ఆందోళన చెందుతున్నాం. తాకట్టు నుంచి కళాశాలల్ని మినహాయించాలని కోరుతున్నాం’ అని పూర్వ విద్యార్థి ధర్మేంద్ర పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖలో ఆదివారం పవన్ కల్యాణ్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details