విశాఖపట్నం జిల్లా పాడేరులోని భీమసింగి పాకలపాటి గురుదేవ ఆశ్రమ భక్తులు స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటి ముందు ఆందోళన చేశారు. అంచెలంచెలుగా కష్టపడి అభివృద్ధి చేసిన ఆశ్రమంలో కొంతమంది వ్యక్తులు చొరబడుతున్నారని ఆరోపించారు. ఆశ్రమాన్ని కాజేయడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. శాస్త్రపరంగా పూజలు జరగడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారని... దీంతో ఆర్డీవో విచారణ పేరిట వేధిస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. కొంతమంది కావాలనే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు పాకలపాటి గురుదేవ ఆశ్రమ భక్తుల ఆందోళన
విశాఖపట్నం జిల్లా పాడేరులో స్థానిక ఎమ్మెల్యే ఇంటి ఎదుట భీమసింగి పాకలపాటి గురుదేవ ఆశ్రమ భక్తులు ఆందోళన చేశారు. ఆశ్రమంలో కొంతమంది వ్యక్తులు చొరబడి, ఆశ్రమాన్ని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు పాకాలపాటి గురుదేవ ఆశ్రమ భక్తుల ఆందోళన
ఈ విషయంపై పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఎమ్మెల్యే ఇంట్లో ఎంపీ మాధవి ఉండటంతో.. ఆమె బయటకొచ్చి భక్తులకు నచ్చజెప్పారు. సమన్వయంతో సమస్యను పరిష్కరించుకుందామని సూచించారు.
ఇవీచదవండి.
పెరుగుతున్న కరోనా కేసులు..చర్యలు చేపట్టిన అధికారులు
లింగుస్వామి చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా రామ్!
Last Updated : Apr 18, 2021, 8:41 AM IST