దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తిస్తోందంటూ విశాఖలో దళిత సంఘాల నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దళిత దాడులకు నిరసనగా... జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన చేపట్టారు. దళితులకు విద్యాపరంగా వచ్చే హక్కులను వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఈ దాడుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో దళిత సంఘాల నేతల ఆందోళన - విశాఖ నేటి వార్తలు
విశాఖలో దళిత సంఘాల నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విశాఖలో దళిత సంఘాల నేతల ఆందోళన