ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత

కరోనా విపత్కర పరిస్థితుల్లో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించడంపై తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరీక్షల కోసం విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టాలనుకోవడంపై ఆగ్రహం వ్యకం చేస్తున్నారు. పరీక్షలు రద్దు చేయాలని లేకుంటే వాయిదా వేయాలని డిమాండు చేస్తున్నారు.

పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత
పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత

By

Published : Apr 30, 2021, 3:54 AM IST

పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత

వైరస్‌ మహమ్మారి విలయంలా విరుచుకుపడుతున్న తరుణంలో...... రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షలపై ప్రభుత్వ తీరు...విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఇబ్బందులు పడుతున్న వేళ విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధమవుతారని ప్రశ్నిస్తున్నారు. భయంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని.... ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల కన్నా పిల్లల ప్రాణాలే ముఖ్యమని చెబుతున్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో సంబంధించిన విషయం కాదని..మొత్తం సమాజంపై వైరస్ పంజా విసిరే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్‌, వారి ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణించాలంటే.... పదో తరగతిలో తప్పనిసరిగా మంచి మార్కులు ఉండాలనే ఉద్దేశంతోనే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ విద్యార్థుల ప్రాణాల కంటే పరీక్షలు ముఖ్యం కాదని... విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

విద్య అనేది ఉపాధి కోసమని, మొత్తం ఉపాధి రంగమే అతలాకుతలం అయితే పరీక్షలు పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నల్ పరీక్షలను ఆధారంగా చేసుకుని మార్కులు ఇవ్వడం, లేదా మరికొద్ది నెలలపాటు వాయిదా వేయడం చేస్తేనే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఊరట కలుగుతుందని విద్యావేత్తలు అంటున్నారు.

కరోనా బారిన పడి ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు చనిపోయిన సమయంలో మరింత ఆందోళనకు గురిచేసే చర్యలు సరికాదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి

ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో హెల్త్ కార్డులు: ఆర్పీఠాకూర్

ABOUT THE AUTHOR

...view details