విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఆగస్టు నాలుగో తేదీన వైద్యాధికారిణి శ్యామల మృతదేహాన్ని గుర్తించారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానించిన పోలీసులు.. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో శ్యామల ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడితే వాస్తవాలు తెలుస్తాయని కోరారు.
'అనుమానాలున్నాయి.. సమగ్ర విచారణ చేపట్టండి' - medical officer sheyamala death
విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో ఆగస్టు నాలుగో తేదీన మృతి చెందిన వైద్యాధికారిణి శ్యామల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి బంధువులు ఆందోళన చేశారు.

కశింకోటలో ఆందోళన
తల్లిదండ్రులు లేకపోయినా భర్త, అత్తామామల సహకారంతో శ్యామల కష్టపడి చదివి వైద్యురాలిగా ఉద్యోగం సాధించిందని, ఎవరో హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీచదవండి.