ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూర్తిస్థాయి నీటి నిల్వలతో రైవాడ జలాశయం - water levels in raiwada reservoir news

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్​లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది.

raiwada reservoir
రైవాడ జలాశయంలోని నీటి నిల్వలు

By

Published : Nov 15, 2020, 12:30 PM IST

విశాఖలోని రైవాడ జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు కురవటంతో రిజర్వాయర్ పూర్తిస్థాయిలో​ నిండింది. దీంతో సాగు, తాగునీరు పుష్కలంగా అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్​ ఆఖరి దశలో ఉంది.. రానున్న రబీ సీజన్​లో సాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం కుడి, ఎడమ కాల్వల ద్వారా పంటపొలాలకు నీటిని విడుదల చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో తాగునీటికి 50 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details