భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. గురువారం రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ మధ్య కాలంలో భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూముల వివరాలను 22ఏలో నమోదు చేయాలన్నారు.
భూ ఆక్రమణలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి: విశాఖ జిల్లా కలెక్టర్ - vishaka district collector vinyachand news
ఇటీవల కాలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.
vishaka district collector
తహసీల్దార్లు సెప్టెంబరు 1 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ భూములు, వాటి ప్రస్తుత స్థితి వివరాలను సేకరించాలని కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని సూచించారు.