నర్సీపట్నం ఆర్టిసీ డిపో పరిధిలో బస్సు సర్వీసులు ప్రారంభం - bus services start Narsipatnam RTC Depot
నర్సీపట్నం ఆర్టిసీ డిపో పరిధిలో చాలా కాలం తర్వాత బస్సు సర్వీసులను ప్రారంభించారు. కరోనా లాక్డౌన్ కొద్దిరోజులుగా పూర్తిగా నిలిపివేసినా సర్వీసులను దశలవారీగా విస్తరిస్తున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టిసీ డిపో పరిధిలో చాలా కాలం తర్వాత బస్సు సర్వీసులను ప్రారంభించారు. కరోనా లాక్డౌన్ కొద్దిరోజులుగా పూర్తిగా నిలిపివేసినా సర్వీసులను దశలవారీగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగు నెలలపాటు బస్సు సౌకర్యాన్ని నోచుకోని విశాఖ ఏజెన్సీలోని కృష్ణదేవిపేట మీదుగా తిరిగే మంప, బోధ రాళ్ల, రేవాళ్ళు, తుని మీదుగా గూడెంకొత్తవీధి సీలేరు తదితర ప్రాంతాలకు స్థాయిలో సర్వీసులను తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు కండక్టర్ రహిత సర్వీసులను నడిపారు. తాజాగా సర్వీసులను విస్తరించడంలో భాగంగా మన్యం ప్రాంతాలకు పూర్తిస్థాయిలో బస్సులను నడుపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలను సాగిస్తున్నారు.