ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంగురాళ్ల క్వారీ ముఠా గుట్టురట్టు - visakha news

విశాఖ మన్యంలో అక్ర‌మంగా రంగు రాళ్ల క్వారీ నిర్వ‌హిస్తున్న ముఠాను అట‌వీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక నాటు తుపాకీ, మూడు బాణాలు, 21 రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

రంగురాళ్ల క్వారీ నిర్వ‌హిస్తున్న ముఠా గుట్టురట్టు

By

Published : Jul 24, 2019, 10:39 PM IST

త‌విటినాయుడు

విశాఖ ఏజెన్సీలో రంగురాళ్ల క్వారీ ముఠా గుట్టును.. అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. వారం రోజులుగా విశాఖ మ‌న్యం జీకే వీధి మండలం సిగ‌నాప‌ల్లిలో అక్ర‌మంగా రంగురాళ్లు త‌వ్వి వ్యాపారం చేస్తున్న విషయంపై వస్తృత సోదాలు చేశారు. అప్ర‌మ‌త్త‌మై స‌హాయ అట‌వీ శాఖ అధికారి త‌విటి నాయుడు బృందం... క్వారీ వ‌ద్ద వ్యాపారి చిన్న నూక‌రాజుతో పాటు మ‌రో ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి ఒక నాటు తుపాకీ, మూడు బాణాలు, 21 రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు. అట‌వీ ప్రాంతంలో రంగురాళ్లు త‌వ్వితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చ‌రించారు.

ABOUT THE AUTHOR

...view details