విశాఖలో రంగురాళ్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నాల్గొవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రంగురాళ్లను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారంతో... పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముఠా గుట్టును రట్టు చేశారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలానికి చెందిన నాగ గిరిబాబు... రంపచోడవరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.70 వేలకు కొన్ని రంగురాళ్లను కొనుగోలు చేశాడు. విశాఖలో గోవిందసాయి కృష్ణ, సానాల బాబురావు అనే మధ్యవర్తుల ద్వారా... గిరిబాబు, సూర్రెడ్డి దశావతారం అనే వ్యక్తికి వాటిని అమ్ముతుండగా... వారిని అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. వారి వద్ద నుంచి రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నారు.