విశాఖ మన్యం పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో వాలంటీర్లకు సత్కార సభ నిర్వహించారు. ఐదు మండలాల నుంచి వాలంటీర్లు హాజరయ్యారు. పాడేరు ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ జి. మాధవి, పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని.. వాలంటీర్లకు అవార్డులు అందజేశారు.
గతంలో పాడేరు ఐటీడీఏ పీవోగా పని చేయడం వల్ల మన్యంలో పరిస్థితులు తనకు బాగా తెలుసునని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. మైదాన ప్రాంతాలతో పోల్చి చూస్తే.. మన్యంలో రహదారి, రవాణా సమాచార వ్యవస్థలు పూర్తిగా లేకపోయినా వాలంటీర్లు తమ విధులను చిత్తశుద్దితో అమలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు.