డాక్యుమెంటేషన్ రికార్డులను రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు భద్రపరచాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు. గ్రామాల్లో ఎవరు భూములు ఇచ్చారో వారి పాస్బుక్లు, టైటిల్ డీడ్స్, ఫోటోలు.. రికార్డులలో భద్రపరచి ఉంచుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విశాఖపట్నం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఆర్ఓఎఫ్ఆర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.
గ్రామ సచివాలయం, తహసీల్ధార్, ఆర్డీవో సంబంధిత కార్యాలయాల్లో డాక్యుమెంటేషన్ నఖలు, ఫోటోలు పక్కాగ ఉండాలని ఆదేశించారు. ఏజెన్సీ పరిధిలోని ఆయా మండలాల్లో ఆర్ఓఎఫ్ఆర్కు సంబంధించి మండలాల వారిగా.. ఎంతెంత భూములు ఉన్నాయో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్ కలెక్టర్కు వివరించారు.