ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉత్తమ పురస్కారానికి జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉంది' - ఉత్తమ పురస్కారానికి జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉంది

ఎన్నికల సంఘం తరఫున ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లాగా పురస్కారం అందుకోవడం అనందంగా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. ఈనెల 25న రాజ్ భవన్​లో అవార్డును అందుకోనున్నారు.

collector vinay chand on ec award
ఉత్తమ పురస్కారానికి జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉంది

By

Published : Jan 22, 2021, 10:20 PM IST

రాష్ట్రస్ధాయిలో ఓటర్ల జాబితా, సవరణ వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం మంచి పనితీరు కనబర్చడం వల్లే ఎన్నికల సంఘం ఇచ్చే ఈ గౌరవం పొందగలిగామని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లాలకు ఎన్నికల సంఘం నుంచి ఇచ్చే పురస్కారానికి జిల్లా ఎంపికైంది.

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాలో జరిగిన ఓటర్ల జాబితా, ఇతర అంశాలపై పనితీరును ఎన్నికల సంఘం మదింపు చేసి ఈ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈనెల 25న రాజ్ భవన్​లో జరిగే కార్యక్రమంలో జిల్లా తరఫున ఈ పురస్కారం అందుకోనున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details