ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య సిబ్బంది నియమకాలను పూర్తిచేయండి - విశాఖలో కోవిడ్​పై కలెక్టర్ సమావేశం

విశాఖ జిల్లాలోని ఆసుపత్రులలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియమకాలను పూర్తిచేయాలని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్​ను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, వైద్య సిబ్బంది నియామకాలు, ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా తదితర విషయాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

visakha
విశాఖలో కలెక్టర్ సమావేశం

By

Published : May 19, 2021, 10:06 PM IST

విశాఖ జిల్లాలోని ఆసుపత్రులలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియమకాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్​ను ఆదేశించారు. జిల్లాలోని కోవిడ్ నియంత్రణ, వైద్య సిబ్బంది నియామకాలు, ఆక్సిజన్ ప్రొక్యూర్​మెంట్, ఆసుపత్రులకు సరఫరా తదితర విషయాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 79 ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా జరగాలని అన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా వాటికి సెక్యూరిటీ వాహనాలు ఏర్పాటు చేయాలని ఉపరవాణా కమిషనర్​​ను ఆదేశించారు. ఇందుకు అవసరమైన రెవెన్యూ సిబ్బందిని విధులలో నియమించాలని ఆర్డీఓ పెంచల కిషోర్​కి తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా విషయంలో ఆర్డీఓ సహకారం తీసుకోవాలని ఔషధ నియంత్రణ సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు. హెల్త్ సిటీలో 48 వరకు ఆసుపత్రులు ఉన్నాయని.. వాటి ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళికతో తగుచర్యలు చేపట్టాలన్నారు. కొన్ని ఆసుపత్రులలో పడకల పెంపును పరిశీలించాలన్నారు. జర్మన్ హాంగర్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని... ఆర్ఎండ్​బీ ఎస్.ఇ. సుధాకర్​ను కోరారు. వైద్యులు, వైద్య సిబ్బందిని నియామకాలు తక్షణమే చేపట్టాలని.. ఏఎంసీ.ప్రిన్సిపల్ డా.సుధాకర్​ను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details