వినియోగించిన పంచాయతీ నిధులు రికవరీ చేయాలని కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా కె.కోటపాడులో చేసిన ఖర్చుకు.. సరైన లెక్కలు చూపలేదని పంచాయతీరాజ్ ఈవో అప్పారావు తెలిపారు. ఈ వ్యవహారంలో మాజీ సర్పంచి డోకల లక్ష్మీ నుంచి రూ.10.31 లక్షలు రికవరీ చేయడానికి ఉత్తర్వులు వచ్చాయన్నారు.
రూ.10 లక్షలు పంచాయతీ నిధుల రికవరీకి కలెక్టర్ ఆదేశం - k kotapadu panchayat funds
గ్రామాల అభ్యున్నతికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. పలు సంక్షేమ పథకాలకు నిధులు అందిస్తున్నాయి. ఆ సొమ్ము కొన్ని చోట్ల పక్కదారి పడుతోంది. విశాఖ జిల్లా కె. కోటపాడులో పంచాయతీలో.. నిధులైతే ఖర్చు చేశారు. సరైన లెక్కలు, ఆధారాలు చూపకపోవడంతో.. అప్పటి సర్పంచ్ నుంచి రూ. 10.31 లక్షలు రికవరీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పంచాయతీ నిధుల రికవరీకి కలెక్టర్ ఆదేశం
పంచాయతీ నిధుల విషయమై గతంలో అందిన ఫిర్యాదు మేరకు డీఎల్పీవో విచారణ చేపట్టారు. నివేదికలో చూపిన వాటికి ఖర్చు చేసిన ఆధారాలు చూపించలేదన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆ సొమ్ము తిరిగి రాబట్టడానికి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వైకాపా ప్రోద్భలంతో అధికారులు సరిగా విచారణ చేయలేదని మాజీ సర్పంచ్ డోకల లక్ష్మీ ఆరోపించారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ పథకాల అమలుకు ఎంపీడీవో హామీ