విశాఖ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 18 న జరగనుందని కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్...వారికి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల విధానాలను వివరించారు. 18వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు.
ఎన్నికైన వార్డు మెంబర్లు తప్పనిసరిగా తమ ఎన్నికల ధ్రువీకరణ పత్రంతో.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఉదయం 10.30ని.లకు హాజరు కావాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికైన 98 మంది వార్డు సభ్యులు,15 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మెుత్తం 113 మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని వివరించారు.