విశాఖ జిల్లా చీడికాడ మండల పరిధిలో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు విస్త్రృత పర్యటనలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ భవనాలతో పాటు వాటి కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం కోనాం మధ్యతరహా జలాశయ ప్రాంతాన్ని సందర్శించి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
సచివాాలయ భవనాల పరిశీలన..
ఉత్తరాంధ్రలోని జేబీపురంలో తొలిసారిగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయ భవనాన్ని పరిశీలించారు. కొత్తపల్లిలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం సహా ఇతర భవనాలను సైతం సందర్శించారు.