ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

Steel plant privatisation: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో స్టీల్ ప్లాంట్​కు అన్యాయం జరిగిందని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సీహెచ్ నరసింగరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అఖిల కార్మిక కర్షక జేఏసీ.. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Collection of one crore signatures against privatisation of Visakha steel plant
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

By

Published : Feb 2, 2022, 7:15 PM IST

Steel plant privatisation: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అఖిల కార్మిక కర్షక జేఏసీ.. కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ సిగ్నేచర్ ను ఏయూ జర్నలిజం విభాగంలో మొదలుపెట్టారు. విభాగాధిపతి ఆచార్య డీవీఆర్ మూర్తి తొలి సంతకం చేశారు.

విశాఖ అంటే స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది

ప్రతి ప్రాంతానికి ఓ గుర్తింపు ఉంటుందని.. విశాఖ అంటే స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుందని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సీహెచ్ నరసింగరావు అన్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్​కు.. కేంద్రం గనులు కేటాయించకుండా ప్రైవేటీకరణ నిర్ణయం సరైంది కాదని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో స్టీల్ ప్లాంట్​కు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:

Movie Ticket: కమిటీ నివేదిక కోసం సినీ పరిశ్రమ ఎదురు చూస్తోంది: ముత్యాల రాందాస్

ABOUT THE AUTHOR

...view details