మొక్కలు పెంచండి-పర్యావరణాన్ని కాపాడండి... అంటూ ప్రభుత్వం చాలా ప్రకటనలు చేస్తుంది. కానీ విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం నిర్మాణం కోసం చెట్లు నరికేశారు. పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం నిర్మించొద్దని ఆ గ్రామస్థులు కోరుతున్నారు. ఆటస్థలం ఉండదని, చదువుకి ఆటంకం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోచోట నిర్మించాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
'మా పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం నిర్మించొద్దు' - విశాఖలో గ్రామసచివాలయం కోసం చెట్లు నరికివేత
ప్రభుత్వం మొక్కల పెంపకానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ ఓ ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలులో చెట్లు కూల్చారు. తురుమల ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం నిర్మిస్తున్నారు. నిర్మాణం ఆపాలని గ్రామస్థులు కోరుతున్నారు.
!['మా పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం నిర్మించొద్దు' collapse trees for construction of grama sachivalayam at vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6070607-1069-6070607-1581674196327.jpg)
విశాఖలో సచివాలయం కోసం కూలిన చెట్లు
'మా పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం నిర్మించొద్దు'
ఇదీ చదవండి : రాజధానుల ప్రకటనతో స్థిరాస్తి రంగానికి ఎదురుదెబ్బ
Last Updated : Feb 14, 2020, 6:12 PM IST
TAGGED:
updates on gram sachivaly