Low Temperatures in Manyam: విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. మినుములూరులో 11.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పాడేరులో 13 డిగ్రీలుగా ఉంది. ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. చలి తీవ్రతతో గిరిజనులు అల్లాడుతున్నారు.
నేడు పలుచోట్ల వర్షాలు..
Rains in AP: మరోవైపు దక్షిణ కోస్తాలో ఒకటిరెండు చోట్ల మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.