విశాఖ ఏజెన్సీ వాసులను చలి వణికిస్తోంది. 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరులో మంచు జల్లులు కురిశాయి. చలి పంజాలో మన్యం గజగజ వణుకుతోంది. పొగమంచు దట్టంగా కమ్మేసింది. మినుములూరు 11, పాడేరు 13 డిగ్రీలు కనీస ఉష్ణోగ్రత నమోదైంది. మంచు కప్పేస్తున్న కారణంగా.. రహదారిపై రాకపోకలు ఇబ్బందిగా మారాయి. చలి గాలులు అధికంగా వీస్తున్నాయి. ఉదయం, రాత్రి మంచు దట్టంగా కురుస్తోంది. చలి, మంచు కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విశాఖ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు - Visakhapatnam Agency latest news
చలి చంపేస్తోంది. విశాఖలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత 11 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతగా నమోదైంది.

Visakhapatnam Agency area