ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తీరంలో ఉగ్రదాడులు ఎదుర్కొనేందుకు మెరైన్ పోలీసులు సిద్ధం' - Visakhapatnam Coastal Security latest news

తీరంలో ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు మెరైన్ పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉందని కోస్టల్ సెక్యూరిటీ డీఎస్పీ ఆర్. గోవిందరావు తెలిపారు. తీరం వెంబడి అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మత్స్యకారులకు సూచించారు.

స్టల్ సెక్యూ ర్టీ డీఎస్పీ ఆర్. గోవింద రావు
Coast Guard DSP Govinda Rao

By

Published : Jan 24, 2021, 10:39 AM IST

సముద్ర తీరంలో ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కొనేందుకు మెరైన్ పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉందని కోస్టల్ సెక్యూరిటీ డీఎస్పీ ఆర్. గోవింద రావు తెలిపారు. విశాఖ జిల్లా పెంటకోట మెరైన్ పోలీసు స్టేషన్ ను డీఎస్పీ సందర్శించారు.

తీరం వెంబడి కొత్త వ్యక్తులు, అనుమానిత బోట్లు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మత్స్యకారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details