విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 35 ఎకరాల స్థలంలో వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాలకు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 500 కోట్ల రూపాయల అంచనా విలువతో చేపట్టనున్న ఈ కళాశాలకు సంబంధించిన పూర్తి నివేదికను హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ తయారు చేసింది.
లక్షా 39 వేల చదరపు మీటర్లు..
35 ఎకరాల్లో 22 భవనాలతో సుమారు లక్షా 39 వేల చదరపు మీటర్లలో నిర్మించబోయే బోధన్ ఆస్పత్రి, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, వసతి గృహం, నివాస గృహాలు, ఇతర సదుపాయాలను కల్పించనున్నారు. సుమారు 500 పడకల సామర్థ్యంతో బోధన్ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ కళాశాలలో 100 వైద్య విద్య సీట్లను కేటాయించారు. మరో 60 సీట్లను నర్సింగ్ విద్యకు రిజర్వ్ చేశారు.
ఇవీ చూడండి:
తెదేపా మహిళా కార్యవర్గం సభ్యులు వీరే