CM residence on Rushikonda: విశాఖ నుంచి పాలనకు సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కోసం.. రుషికొండపైనే నివాసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీచ్ వైపు నిర్మిస్తున్న విజయనగర బ్లాక్‌ను సీఎం నివాసంగా ఉపయోగిస్తారని.. బీచ్‌లో హెలిప్యాడ్ నుంచి నివాసానికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారని.. ప్రచారం సాగుతోంది. కళింగ బ్లాక్‌ను సీఎంఓ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. కళింగ, వేంగి బ్లాకులు దాదాపు సిద్ధంకాగా.. రుషికొండను చుట్టూ పోలీసులను భారీగా మోహరించారు.
Construction of Wall Around Rushikonda : నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం..
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో చట్టాల్ని ధిక్కరించి.. దొడ్డిదారిన విశాఖకు రాజధానిని తరలించేందుకు.. జగన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ఆ దిశగానే అధికార యంత్రాంగం వేగంగా పనులు చేస్తోంది. రుషికొండపై 4 బ్లాకుల్లో 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడే సీఎం నివాసం, కార్యాలయం ఉంటాయని.. సీఎం కుటుంబంతో ఉండేందుకు విజయనగర బ్లాక్‌ను.. సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ బ్లాక్‌ను 5,828 చదరపు మీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించగా, ఇప్పుడు 3,764 చదరపు మీటర్లకు కుదించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న... ఈ భవనం నుంచి సాగర అందాలు... ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇందులోనే ప్రెసిడెన్షియల్ సూట్ గదులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం.... కళింగ బ్లాక్‌ను వినియోగిస్తారని సమాచారం. తొలుత 5,753 చదరపు మీటర్లలో కళింగ బ్లాక్ నిర్మించాలని.. నిర్ణయించినా ఇప్పుడు 7266 చదరపు మీటర్లకు పెంచారు. 1,821.12 చ.మీ.లతో వేంగి బ్లాకును.. సిద్ధం చేయగా..690.40 చ.మీ.లలో నిర్మిస్తున్న గజపతి బ్లాక్ పనులు... చివరిదశలో ఉన్నాయి.