పార్టీలకు అతీతంగా నిరుపేదలైన అర్హులకు సీఎం సహాయనిధి మంజూరుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా మండల కేంద్రం చీడికాడలో సీఎం సహాయ నిధి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముత్యాలనాయుడు చేతులమీదుగా సీఎం సహాయనిధి నగదు చెక్కులను లబ్ధిదారులకు అందించారు. నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో 23 మందికి రూ.7.46 లక్షల సీఎం సహాయనిధి ఈ విడత మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో వైకాపా మండల శాఖ అధ్యక్షుడు అప్పారావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
'నిరుపేదలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుంది' - మాడుగుల నియోజకవర్గంలో సీఎం సహాయనిధి
మాడుగుల నియోజవర్గంలో 23 మందికి సీఎం సహాయనిధి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు తెలిపారు. పార్టీలకు అతీతంగా.. నిరుపేదలకు వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
cm relief fund release