ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

cm vishaka tour: నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన - CM Jagan latest news

cm vishaka tour: నేడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు.

నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన

By

Published : Dec 17, 2021, 3:59 AM IST

cm vishaka tour:ముఖ్యమంత్రి జగన్‌ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4గంటల 10 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి జగన్‌ విశాఖకు బయల్దేరనున్నారు. 5 గంటల 20 నిమిషాలకు ఎన్ఏడీ ఫ్లై ఓవర్‌తో పాటు వీఎమ్ఆర్​డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు. ఆరు గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ నాయుడుబాబు కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. 6గంటల 20 నిమిషాలకు ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవం చేస్తారు. ఏడు గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న జగన్‌... రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి తిరుగు పయనమవుతారు.

ABOUT THE AUTHOR

...view details