విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. భోగాపురం విమానాశ్రయం, బీచ్ కారిడార్ పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖకు పోలవరం జలాల తరలింపు పనులు వేగవంతం చేయాలన్నారు. మెట్రో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ - భీమిలి బీచ్ రోడ్డు విస్తరణ, భీమిలి - భోగాపురం బీచ్ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. బీచ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భీమిలి - భోగాపురం రోడ్డుకు రూ.1,167 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు.