ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాండ్రంగి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరు - అల్లూరిలో పాండ్రంగి బ్రిడ్జి నిర్మాణం

విశాఖ జిల్లా అల్లూరి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న పాండ్రంగి వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ముఖ్యమంత్రి జగన్.. దీని నిర్మాణానికి రూ. 14 కోట్ల నిధులు మంజూరు చేెశారు. జగన్ నిర్ణయంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

cm jagan released 14 cords funds to low pandrangi bridge at alluri village vishaka district
పాండ్రంగి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరు

By

Published : Sep 24, 2020, 12:02 AM IST

విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంగి లోలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ. 14 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు... వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఓ దశలో స్ధానికులు లోలెవల్ ఎప్పుడు వస్తోందోనని కళ్లు కాయలు కాసేలా చూస్తుండేవారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రకటన ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. దీర్ఘకాలిక సమస్యకు సీఎం పరిష్కారం చూపారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

అల్లూరి స్వగ్రామంలో ఈ వంతెన నిర్మించడం వల్ల సమీప గ్రామాలు అభివృద్థి చెందుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:అర్థాంతరంగా ఆగిన ఒంగోలు తాగునీటి పథకం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details