రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విశాఖలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం విశాఖ చేరుకోనున్నట్లు విశాఖ నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రతిపాదించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.... విమానాశ్రయం నుంచి ఆర్కే బీచ్ వరకు సాదర స్వాగతం పలకనున్నట్లు పేర్కొన్నారు. జగన్ విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన.. ఘన స్వాగతానికి ఏర్పాట్లు - cm jagan visakhapatnam visit news in telugu
ముఖ్యమంత్రి జగన్ రెండు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రతిపాదించిన నేపథ్యంలో జగన్‌కు ఘన స్వాగతం పలకాలని వైకాపా నేతలు నిర్ణయించారు.
అనకాపల్లిలో సీఎం పర్యటన
అనకాపల్లిలోనూ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అనకాపల్లి వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు అనకాపల్లి నుంచి కార్ల ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఫిల్టర్ వాటర్ అందించేలా రూ.32 కోట్ల వ్యయంతో అగనంపూడి నుంచి పైప్ లైన్ పనులు చేపట్టేందుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు అమర్నాథ్ తెలిపారు. దీనితో పాటుగా అనకాపల్లిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం నిధులు కేటాయించారని వెల్లడించారు.
ఇదీ చూడండి: రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన