విశాఖ జిల్లా పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రైతులకు గిట్టుబాటు ధరలకు సంబంధించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో తొలిసారిగా సీఎం జగన్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు వైకాపా ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పాలన చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేసిన 10 రోజుల్లోనే రైతులకు అధికారులు చెల్లింపులు చేస్తారని చెప్పారు. ఈ ప్రక్రియతో సన్న, చిన్నకారు రైతులకు మేలు జరుగుతుందన్నారు.