CM Jagan Does Not Care SC&ST Youth Employment : ప్రతి సమావేశంలోనూ ఎస్సీ, ఎస్టీ లపై తనకే పేటెంట్ ఉన్నట్లు చెప్పే సీఎం జగన్.. వారి ఉద్యోగావకాశాలను గాలికి వదిలేశారు. కోర్ ఇంజినీరింగ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ చదివే ఎస్సీ, ఎస్టీల్లో 15 నుంచి 20 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. సాఫ్ట్‌వేర్ కంపెనీల అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు లేకపోవడంతో అక్కడా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. కళాశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఒక్కో విద్యార్థి 50 వేలు ఖర్చు చేసి, కొత్తగా కోర్సులు నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ వ్యయాన్ని భరించలేని ఎస్సీ, ఎస్టీలు నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. చిన్నచిన్న పనులు, ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Technical Skill Development University in Vizag Jagan Skips Assurance :ఆధునిక సాంకేతిక నైపుణ్యాల కోసం విశాఖపట్నంలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్.. ఆ హామీని అటకెక్కించారు. నైపుణ్య కళాశాలలకు ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేయకుండా ఉన్న వాటిల్లోనే సర్దుబాటు చేసి, కోర్సులను పరిమితం చేసేశారు.
నిర్వహణకు నిధులు లేక.. కేంద్ర ప్రభుత్వ పథకం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన కింద వాటిని నిర్వహిస్తున్నారు. నైపుణ్యాల కొరత కారణంగా కళాశాలలో ఉద్యోగాలు లభించని వారికి పరీక్షలు పెడితే ఎలా ఎంపికవుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు నిధులు ఇవ్వకపోవడంతో కార్యకలాపాలు తగ్గిపోయాయి.
AP Medical seats for sale ఏడాదిలో 694 ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధుల సీట్లను అమ్మేస్తారా ! ఇదేనా బడుగు బలహీనవర్గాలపై ప్రేమ.
CM Jagan Cheated Students : విజయవాడకు సమీపంలోని ఓ ఎటానమస్ కళాశాలలో బీటెక్ నాలుగో ఏడాదిలో 700 మంది ఉంటే 501 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఓసీ, బీసీ, ఇతరులకు కలిపి 60 శాతం నియామకాలు వస్తే.. ఎస్సీ విద్యార్థులకు 41శాతం, ఎస్టీలకు 35 శాతం నియామకాలు వచ్చాయి. దాదాపుగా అన్ని కళాశాలల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. విజయనగరం జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో CSE చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఏడుగురు ఉంటే వీరిలో ముగ్గురు ఉత్తీర్ణులయ్యారు. వారిలో ఒక్కరికే ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగం లభించింది.