CM Jagan Cheated Fishermen: సీఎం జగన్ మాట తప్పడు, మడమ తిప్పడని వైసీపీ శ్రేణులు.. గొప్పలు రివర్సయ్యాయి. పూడిమడక మత్స్యకారులకు.. విపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీ అంశంలో జగన్ మడమ తిప్పేశారు. నాలుగేళ్లుగా వారికి పరిహారం ఇవ్వకపోవడంతో.. విసిగిన సొంత పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి.
"సెజ్ దగ్గర్నుంచి సముద్రంలోకి ఏర్పాటు చేస్తున్న ఏపీఐఐసీ పైపులైను కోసం టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏపాటిది.? మేము అధికారంలోకి వస్తే సెజ్‌లోని పరిశ్రమల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తాం. మాకు మద్దతుగా నిలవండి. మీ జీవితాలను మార్చేస్తాం." ఇవి 2018 ఆగస్టు నెలాఖరున ప్రతిపక్షనేతగా నిర్వహించిన పాదయాత్రలో అచ్యుతాపురం పూడిమడక మత్స్యకార సంఘ నాయకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇది.
ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు దాటిన బోడు మల్లన్నఅన్న చందంగా మత్స్యకారుల్ని సీఎం జగన్ముం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగపుత్రులకు ఇచ్చిన ప్యాకేజీ, ఉద్యోగ హామీని గంగలోనే కలిపేశారు. నాడు ఎన్నికల్లో లబ్ధి కోసం నెత్తిపై తాటాకు టోపీ, వల చేతపట్టుకుని తనదైన శైలిలో నవ్వుతూ, ముద్దులు పెడుతూ పూడిమడక మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు నింపుతానని ఉత్త మాటలు పలికారు.
ప్రకటనలకే పరిమితమైన జగన్ మాటలు.. ఇప్పటికీ ట్రిపుల్‌ఐటీలకు నో వీసీ
ఎన్నికల ప్రచార సభల్లో ఆపార్టీ ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుడివాడ అమర్నాథ్.. జగన్ ఇచ్చిన హామీనే పునరుద్ఘాటిస్తూ వచ్చారు. ఇదంతా నిజమని నమ్మిన మత్స్యకారులు పూడిమడకలో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. తీరా గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీని పక్కన పెట్టేసింది.
నాలుగేళ్లుగా ఇదిగో అదిగో అంటూ నాన్చుతూ గంగపుత్రులను మోసగిస్తోంది. ఇంటికో ఉద్యోగం మాట అటుంచితే.. 5 లక్షల రూపాయల పరిహారం కూడా అందించలేకపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అచ్యుతాపురం సెజ్‌లోని రసాయన పరిశ్రమల వ్యర్థాలను శుద్ధిచేసి పూడిమడక తీరంలో వదిలేందుకు ఏపీఐఐసీ ద్వారా పైపులైను నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు.
ASHOK BABU ON CM JAGAN: 'హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారు..'
"టీడీపీ హయంలో సుమారు నాలుగు వేల మంది లబ్దిదారులకు.. ప్యాకేజీ అమలు చేశారు. వైసీపీ నేతలు వచ్చి టీడీపీ మీకు దగా చేస్తోంది.. కేవలం 1లక్ష 25వేలు మాత్రమే ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఐదు లక్షల రూపాయల ప్యాకేజీతో పాటు.. ఇంటికో ఉద్యోగమని హామీ ఇచ్చారు." -మత్య్సకారుడు