నన్ను అరెస్ట్ చేసినా భయపడను: చంద్రబాబు - dgp
'నన్ను ఏకాకి చేసి దాడులు చేసినా భయపడేది లేదు. రేపు నన్ను కూడా అరెస్టు చేసినా భయపడను. జైలులో కూర్చోనైనా పోరాటం చేస్తా. అమిత్ షా అంటాడు నాకు తలుపులు మూసేశాడని.. నిన్ను తలుపులు తీయమని ఎవరు అడిగారు': విశాఖ రోడ్‌షోలో చంద్రబాబు
రాష్ట్రంలో అధికారుల బదిలీలను ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలోని కంచరపాలెంలో నిర్వహించిన రోడ్‌షోలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. 'తెదేపా నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా? నేరస్థులకు కాపల కాసే వ్యక్తి, చేతకాని మనిషి ఈ నరేంద్రమోదీ. కోడికత్తి పార్టీ చెప్పింది కదా అని కేంద్రం.. ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని అధికారులను బదిలీ చేయిస్తే నేను భయపడాలా? ఏ తప్పూ చేయని అధికారులను బదిలీ చేస్తారా? ఏం చేస్తారో చేయండి నేనూ చూస్తా... లెక్క కూడా చేయను. నేను ధర్మం కోసం పోరాడుతున్నా... నా నలభైయేళ్ల రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన చర్య ఎన్నడూ చూడలేదు. నన్ను ఏకాకి చేసి దాడులు చేసినా భయపడేది లేదు. రేపు నన్ను కూడా అరెస్టు చేసినా భయపడను. జైలులో కూర్చోనైనా పోరాటం చేస్తా. అమిత్ షా అంటాడు నాకు డోర్లు మూసేశాడని.. నిన్ను తలుపులు తీయమని ఎవరు అడిగారు. నిన్ను ఏకంగా రాష్ట్రం నుంచే బహిష్కరించా. మీ రాజకీయాలు మా రాష్ట్రంలో చెల్లవు' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు.