విశాఖ పాడేరు మన్యం ఘాట్రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ సమీపంలో భారీ కొండచరియ రోడ్డుకు అడ్డంగా విరిగి పడింది.
విశాఖ మన్యంలో విరిగిపడిన కొండ చరియలు - cliffs are broken at vizag agency latest news
విశాఖ మన్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు... మన్యం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కాఫీ తోటలు ధ్వంసం కాగా... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మన్యంలో విరిగిపడిన కొండ చరియలు
భారీ వర్షానికి బండరాళ్లతో పాటు కొండమట్టి, బురద రోడ్డుకు అడ్డంగా మేట వేసింది. దీంతో పూర్తిగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు దొర్లి రావటంతో.. మధ్యలో ఉన్న కాఫీ తోటలు సైతం ధ్వంసం అయ్యాయి.
ఇదీ చదవండి:పాలవెల్లి సమీపంలో పెరిగిన తుప్పలు.. పట్టించుకోని అధికారులు