ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ ఆరోపణలపై ఖాతాదారులెవరూ ఆందోళన చెందొద్దు' - fraud allegation on Cooperative Bank adivivaram in visakha distrcit

విశాఖపట్నం జిల్లా సింహాచలం అడివివరం సహకార పరపతి బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని సహకారం సంఘం పాలకవర్గం ఓ ప్రకటనలో కోరింది. ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని.. నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయని సహకార సంఘం అధ్య క్షుడు కర్రి అప్పలస్వామి స్పష్టం చేశారు.

అడివివరం సహకార పరపతి బ్యాంకులో అవకతవకలు
అడివివరం సహకార పరపతి బ్యాంకులో అవకతవకలు

By

Published : May 28, 2021, 7:40 PM IST

విశాఖ సింహాచలం అడివివరం సహకార పరపతి బ్యాంకులో అవకతవకలు ఆరోపణలపై ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని సహకారం సంఘం పాలకవర్గం ఓ ప్రకటనలో కోరింది. 2012కు ముందు అప్పటి పాలకవర్గం రూ. 18 కోట్లు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిందని సంఘం అధ్య క్షుడు కర్రి అప్పలస్వామి పేర్కొ న్నారు. తాను బాధ్యతలు చేపట్టాక మొత్తం సొమ్మును బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశామన్నారు.

కొందరూ రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో సంఘంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహకారం సంఘం ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదని హితవుపలికారు. నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details