ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో చాలా ప్రాంతాలకు... రైలు మార్గం, విమాన సర్విసులు లేవు. అక్కడ చదువుకునే విద్యార్థులు రైలును పుస్తకాల్లో, విమానాన్ని ఆకాశంలో చూడటమే. అలాంటి చిన్నారులకు విమానాన్ని ఎక్కిన అనుభూతి కలిగిస్తున్నారు కస్తూర్భా ఉపాధ్యాయులు. చల్లాన్‌గుడ కస్తూర్భా పాఠశాలలో ఒక తరగతి గదికి విమానం ఆకృతి పెయింటింగ్ చేశారు. విమానం ఎలా ఉంటుందో తెలియని విద్యార్థులకు విమానం నమూన గీయించి... వివరిస్తున్నారు. గతంలో రైలు నమూనా వేశారు. ఈ విమానం తరగతి గది విద్యార్థులను ఆకర్షిస్తుంది.
అరె విమానం... కాదుకాదు... తరగతి గదే - మల్కాన్‌గిరిలోని కస్తూరిభా పాఠశాలలో విమాన నమూనాలో తరగతి గది
ఆకాశంలో విమానం చూసి ఆనందించే విద్యార్థులకు... దాని గురించి తెలియజేయాలని ఉపాధ్యాయులు ఓ కొత్త ఆలోచన చేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లా చల్లాన్‌గుడ కస్తూర్భా పాఠశాలలో... తరగతి గదికి విమానం నమూనాలో రంగులు వేయించారు.
![అరె విమానం... కాదుకాదు... తరగతి గదే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4881505-266-4881505-1572150309269.jpg)
విమాన నమూనాలో ఉన్న తరగతి గదిని సందర్శిస్తున్న విద్యార్థులు
TAGGED:
aeroplane la class room