ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవంలో రసాభాస! - Visakha taza news

విశాఖ మల్కాపురం 63వ వార్డులో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవంలో రసాభాస చోటుచేసుకుంది. తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

covid vaccine Inauguration in visakha malkapuram
కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవంలో రసాభాస!

By

Published : Mar 29, 2021, 5:30 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవంలో రసాభాస

విశాఖ మల్కాపురం 63వ వార్డులో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో తెదేపాకు చెందిన వారు రాకూడదంటూ వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ కారణంగా.. స్థానిక 63వ వార్డు తెదేపా కార్పోరేటర్ గల్లా చిన్నను అధికారులు ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రవేశం లేదంటూ వైకాపా శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అధికారులు సర్ది చెప్పిన తర్వాత వివాదం సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details